పల్లవి : నా వేదనలో నా బాధలలో
నా శోధనలో నా జీవితములో "2"
నా కన్నీరు తుడిచి నన్ను ఆదరించి
నీ సేవలో నన్ను నిలిపితివి
అ. ప : ఆరాధనా.... ఆరాధనా .... "2"
ఆరాధనకు పాత్రుడా నిన్నే నేను ఆరాధింతును
స్తుతులకు యోగ్యుడా నిన్నే నేను స్తుతించెదను "2"
చరణం : పాపినైన నన్ను క్షమించితివి
నీ దరికి చేరే భాగ్యము నిచ్చితివి "2"
నన్ను ప్రేమించి అభిషేకించి
నీ సాక్షిగా నన్ను నిలిపితివి "ఆరాధన "
No comments:
Post a Comment