పల్లవి : ఏదో ఆశ నాలో నీతోనే జీవించనీ "2''
యేరై పారే ప్రేమ నాలోనే ప్రవహించనీ
మితిలేని ప్రేమ చూపించినావు
శృతి చేసి నన్ను పలికించినావు
ఈ స్తోత్రగానం నీ సొంతమేచరణం : పరవాసిననైన కడుపేదను నాకేల ఈ భాగ్యము
పరమందు నాకు నీ స్వాస్థ్యము నీవిచ్చు బహుమానము "2"
తీర్చావులే నా కోరిక తెచ్చానులే చిరుకానుక
అర్పింతును స్తుతిమాలిక
కరుణామయా నా యేసయ్య
చరణం : నీ పాదసేవ నే చేయనా నా ప్రాణమర్పించనా
నా సేద తీర్చిన నీ కోసమే ఘనమైన ప్రతిపాదన "2"
ప్రకటింతును నీ శౌర్యము
కీర్తింతును నీ కార్యము
చూపింతును నీ శాంతము తేజోమయా నా యేసయ్య
No comments:
Post a Comment