పల్లవి:సిలువలో పలికిన ఏడు మాటలు
పరదేసు పురములో చేర్చు ప్రేమ బాటలు || 2||
అ ప : మా రక్షణకర్త క్రీస్తు నీకు స్తోత్రం
ముళ్ళ మకుట దారి యేసు నీకు వందనం || 2|| || సిలువలో ||
చరణం:నిన్ను చంపు శత్రువులు నీ ముందర నిలువగా
ఈటెలు కొరడాలతో హింసిస్తూ వుండగా || 2 ||
తండ్రి !! వీరందరు ఏమి చేయుచుంటిరో వీరెరుగరు || 2 ||
వీరిని క్షమియించుమని పల్కితివి || 2 || ||మా రక్షణ||
చరణం:యేసూ!నీ రాజ్యముతో నీవు వచ్చునప్పుడు
తప్పక నను చేర్చుమని సిలువ దొంగ వేడగా || 2 ||
నేడు నీవు నాతోనే పరదేసుననుందువు అని పలికి || 2 ||
ఆ దొంగను రక్షించి యుంటివి || 2 || ||మా రక్షణ||
చరణం:కన్నతల్లి మరియకు యోహానును చూపించి
అమ్మ ఇదిగో నీ కుమారుడని వంటివే || 2 ||
తల్లికాదరనగా యోహనును ఎంచికొని
ఇదిగో నీ తల్లియని భాంధవ్య మొసగితివి || 2 ||
ఇదిగో నీ తల్లియని భాంధవ్య మొసగితివి || 2 || ||మా రక్షణ||
తండ్రి ఎడబాసేనని కడుదూర మోయనని || 2 ||
దేవా నా దేవా.. నన్నెందుకు వీడితివని పలికి || 2 ||
నీ వేదన నివేదించు కొంటివి || 2 || ||మా రక్షణ||
చరణం: సకల సంపద నీలో గుప్తమై ఉన్నవి
జీవ జలహారముతో జివులపోషించితివి || 2 ||
దప్పిక గోనుచున్నానని అప్పగితిని పలికితివా
చేదు చిరకనే నీకు త్రాగమని ఇచ్చిరా || 2 ||
చేదు చిరకనే నీకు త్రాగమని ఇచ్చిరా || 2 || ||మా రక్షణ||
చరణం:లేఖనములు నీయందే నెరవేరి యున్నవి
పాపశాప భారములు వీపున బరియించితివి || 2 ||
నీ గాయములు మాకు నిజమైన స్వస్ధతలు
సమాప్తము అయినదని ఎలుగెత్తి చాటితివా || 2 ||
సమాప్తము అయినదని ఎలుగెత్తి చాటితివా || 2 || ||మా రక్షణ||
చరణం:అద్వితీయ కుమారుడ అధిక శక్తి నొందితివి
ఆత్మతో సత్యముతో తండ్రిని గణపరిచితి || 2 ||
తండ్రి! నా ఆత్మను నీకు అప్పగింతు నంటివి || 2 ||
నీ అంతట నీ ఆత్మను అర్పించితివి || 2 || ||మా రక్షణ||
అవని దద్దరిల్లినది గుడి తెరుయు చీలినది || 2 ||
సమాధుల నున్నవారు తిరిగి లేచి నడచిరి
రవితేజము సన్నగిల్లి సిలువ వెలుగు ప్రజ్వరిల్లె || 2 ||
రవితేజము సన్నగిల్లి సిలువ వెలుగు ప్రజ్వరిల్లె || 2 || ||మా రక్షణ||
This song is available in you-tube
Link: https://youtu.be/0XachTJoKZI
This jesus seven matalu song
ReplyDeleteKeerthipriya
ReplyDeleteSuper song
ReplyDeletesuuuuuuuupper song
ReplyDelete