పల్లవి : ఏ రాగం నాకు రాదు ఎలుగెత్తి పాడుటకు
ఏ జ్ఞానం నాకు లేదు నిను గూర్చి చెప్పుటకు
నిన్నే నమ్ముకున్నాను నిపే ఆనుకున్నాను
ఇలా పాడను ఒక పాట ||2||
నా పాటకు ప్రాణం నీవాయ్యా ఓ యేసయ్యా
నా నోటికి నోరై నిలిచావు నా యేసయ్యా ||2|| ||ఏ రాగం ||
చరణం : బలమైన ఉజ్జివం పరిశుద్దాత్మ అభిషేకం ||2||
నిన్ను గానం చేయుచుండగా ప్రజలందరూ పొందాలి ||2||
నే పాడే ప్రతి పాటా నిన్నే ఆరాధించాలి
నే పలికే ప్రతి పదం నిన్నే మహిమపరచాలి ||2|| ||ఏ రాగం ||
చరణం : నివు చేసిన ఆశ్చర్యాలు నివు చూపిన అద్భుతాలు ||2||
నా స్వరము నుండి నీవే విశ్వమంతా వినిపించాలి ||2||
నే పాడే ప్రతి పాటా నీ నామం ఘణపరచాలి
నే పలికే ప్రతి పదం నీ కీర్తిని కొనియాడాలి ||2|| ||ఏ రాగం ||
This song is available in you-tube:
https://youtu.be/5dYGFBx7F8U
This comment has been removed by a blog administrator.
ReplyDelete