Search This Blog

Wednesday, 12 January 2022

నీ దుఃఖ దినములు...

      


పల్లవి : నీ దుఃఖ దినములు సమాప్తమైయున్నవి.
నీ బ్రతుకులో ముళ్ళు తొలగించబడియున్నవి || 2 ||
అ . ప :ఇన్నాళ్ళు కడగళ్ళు తొలగించగా ఇన్నేళ్ళ కన్నీళ్ళు తుడిచేయగా || 2 || యేసయ్య నిలిచాడు నీ తోడుగా || 2 || ||నీ దుఃఖ||


చరణం :అలసిన నీ ఆశ ప్రభువు తీర్చగా
చెదిరిన నీ మది సరి చెయ్యగా. || 2 || లోకము శోకము నీలో తీసి || 2 || నూతన క్రియలను జరిగించునుగా || 2 || ||నీ దుఃఖ||

చరణం :నీపై నిందను తొలగించగా
తలగా నిన్ను నియమించగా || 2 || ధూషణలన్నీ భూషణములుగా || 2 || హృదిలో చేదును మధురము చేయగా || 2 || ||నీ దుఃఖ||

చరణం : కలతల కడలిని దాటించగా
తరగని సమృద్ధి దయచేయుగా || 2 || పరులకు సాయము చేయగ నిన్ను || 2 || పలు విధములుగా దీవించుగా || 2 || ||నీ దుఃఖ||


This song is available in Youtube:

No comments:

Post a Comment