పల్లవి : నా మనస్సా ఆయన మరుచునా
దేవుడు నిన్ను మరచిపోవునా "2"
ఆయనే నీ భాధలన్నీ కనుమరుగు చేయునే
ఆనంద తైలము నీపై కుమ్మరించునే "2"
స్తుతింపజేయునే నిన్ను అలంకరించునే
కోల్పోయినదంతా పునరుద్ధరించునే "2"
చరణం : నిట్టూర్పు శబ్దము విన్న నీ హద్దులన్నిటిలో
సమృద్ధి గానాలెన్నో ఇది మొదలు వినబడునే "2" తరగిపోను నేను అణగార్చబడను నేను "2"
స్తుతింపజేయునే నిన్ను అలంకరించునే
కోల్పోయినదంతా పునరుద్ధరించునే "2"
సరిచేయు వాడే ఓ...స్థిరపరచినాడే
బలపరచినాడే పూర్ణుణ్ణి చేయునే
సరి చేసి నిన్ను హెచ్చించిన ప్రభువు
ఈ నూతనవత్సరములో అలంకరించునే.చరణం : విచారించే వారు లేక ఒంటరియై యున్న నీకు
ఆరోగ్యము దయచేసి పరిపాలన నిచ్చునే "2" కూలిన కోటను రాజగృహముగా మార్చును "2"
స్తుతింపజేయునే నిన్ను అలంకరించునే
కోల్పోయినదంతా పునరుద్ధరించునే "2"
'' నా మనస్సా "
No comments:
Post a Comment