పల్లవి : అతిపరిశుద్ధుడా స్తుతినైవేద్యము
నీకే అర్పించి కీర్తింతును
నీవు నా పక్షమై నను దీవించగా ..... నీవు నా తోడువై నను నడిపించగా
జీవింతును నీకోసమే ఆశ్రయమైన నా యేసయ్యా "అతిపరి"
చరణం :సర్వోన్నతమైన స్థలములయందు నీ మహిమ వివరింపగా
ఉన్నతమైన నీ సంకల్పము ఎన్నడు ఆశ్చర్యమే "2"
ముందెన్నడూ చవిచూడని సరిక్రొత్తదైన ప్రేమామృతం "2"
నీలోనే దాచావు ఈనాటికై నీ ఋణం తీరదు ఏనాటికి "2" "అతిపరి" చరణం :సద్గుణరాశి నీ జాడలను నా యెదుట నుంచుకొని
గడిచిన కాలం సాగిన పయనం నీ కృపకు సంకేతమే "2"
కృపవెంబడి కృపపొందగా మారాను మధురముగా నే పొందగా "2"
నాలోన ఏ మంచి చూసావయ్యా నీప్రేమ చూపితివి నా యేసయ్యా "2" "అతిపరి"
చరణం :సారెపైనున్న పాత్రగ నన్ను చేజారిపోనివ్వక
శోధనలెన్నో ఎదిరించినను నను సోలిపోనివ్వక "2"
ఉన్నావులె ప్రతిక్షణమునా కలిసి ఉన్నావులె ప్రతిఅడుగున "2"
నీవెగా యేసయ్యా నా ఊపిరి నీవెగా యేసయ్యా నా కాపరి "2" "అతిపరి"
I'm searching for this song i found i this website thanks for sharing..
ReplyDeletePraise the lord , you are welcome Brother.
Delete