Search This Blog

Saturday, 9 February 2019

విశ్వాధిపతి.....








పల్లవి : విశ్వాధిపతి -సర్వలోకమును ఏలే యేసయ్య 
              నీ విశాల సామ్రాజ్యములో - చీకటి తెరలు చీల్చుటకు
              నీ సైన్యాధిపతిగా-నియమించుకొంటివి

అ.ప:   సర్వలోక చక్రవర్తి - నీ సైన్యాధిపతినై
            న్యాయాధిపతి సంస్ధానములో -తుదవరకు పోరాడేద             ||విశ్వాధిపతి ||

1 : సంఘ క్షేమముకు - విఘాతము కలిగించి 
    నీలినీడల మాటును -భ్రమపరిచి నడుపు విరోధితో 
   రక్తము కారునంతగా పోరాడుతకు -దత్త పుత్రాత్మతో నింపి 
   మహా రోషము నిచ్చి -జిహ్వాబలి సమరములో నిలిపితివి               ||అ.ప || ||విశ్వాధిపతి ||


2: సర్వరక్తమిచ్చి కొన్న - గోధుమ పొలములో 
    నిద్రించు కాలమందున - గురుగులు చల్లిన విరోధితో 
    విశ్రాంతి లేకుండా పోరాడుటకు - వాగ్ధాన బలముతో నింపి 
    కృపతో నన్ను కప్పి - పరుగు పందెములో నిలిపితివి                     ||అ.ప || ||విశ్వాధిపతి ||

౩: సమస్త జనములకు - వ్యభిచార మద్యమును 
    త్రాగించి చెరిపపేసిన  - సాతాను దుర్గములు పడద్రోయుటకు 
    ప్రశస్తమైన రత్నములతో - నాకు సరిహద్దులేర్పరచి 
   నీలాంజనములతో కట్టి - యుద్దోపకరనములు ఇచ్చితివి                 ||అ.ప || ||విశ్వాధిపతి ||



This song available in you-tube


No comments:

Post a Comment