పల్లవి : నీ దయలో నేనున్నా ఇంత కాలం
నీ కృపలో దాచినావు గతకాలం ||2 ||
నీ దయలేనిదే నేనెమౌదునో తెలియదయ్యా ||నీ దయలో||
చరణం : తలిదండ్రులు చూపిస్తారు ఎనలేని ప్రేమను ఇలలో
చేయ్యాలని ఆశిస్తారు అందనంత గొప్పవారిగా ||2 ||
నీ దయ వుంటే వారు కాగలరు అధిపతులుగా
నీ దయలేకపోతే ఇలలో బ్రతుకుట జరుగునా
నీ సిలువ నీడలోనే నను దాచి వుంచావని
నా శేష జీవితాన్నే నీతోనే గడపాలని ||నీ దయలో||
చరణం : నేలరాలిన నా ప్రాణాన్ని లేపి నన్ను నిలిపావు
అపవాది కోరలను అంటకుండ దాచావు ||2 ||
నీ రెక్కల నీడలే నాలాశ్రయ దుర్గము
ఏ కీడు నా దరికి రాకుండా నీ కృపను తోడుంచుమా
నీ పాదాల చెంతనే నే పరవశించాలని
నా ఆయువున్నంత వరకు నీ ప్రేమ పొందాలని ||నీ దయలో||
Praise the Lord brother,
ReplyDeleteI would like talk to you so can you call me .
9985522109.
This is my mobile number
Sure brother. Praise the lord
ReplyDeleteAmmen
ReplyDelete