పల్లవి :సీయోను పాటలు సంతోషముగా
పాడుచు సీయోను వెల్లుదము (2)
పాడుచు సీయోను వెల్లుదము (2)
చరణం :లోకాన శాశ్వతానందమేమియు
లేదని చెప్పెను ప్రియుడేసు (2)
పొందవలె నీ లోకమునందు
కొంతకాలమెన్నో శ్రమలు (2) ||సీయోను||
లేదని చెప్పెను ప్రియుడేసు (2)
పొందవలె నీ లోకమునందు
కొంతకాలమెన్నో శ్రమలు (2) ||సీయోను||
చరణం :ఐగుప్తును విడచినట్టి మీరు
అరణ్యవాసులే ఈ ధరలో (2)
నిత్యనివాసము లేదిలలోన
నేత్రాలు కానానుపై నిల్పుడి (2) ||సీయోను||
అరణ్యవాసులే ఈ ధరలో (2)
నిత్యనివాసము లేదిలలోన
నేత్రాలు కానానుపై నిల్పుడి (2) ||సీయోను||
చరణం :మారాను పోలిన చేదైన స్థలముల
ద్వారా పోవలసియున్ననేమి (2)
నీ రక్షకుండగు యేసే నడుపును
మారని తనదు మాట నమ్ము (2) ||సీయోను||
ద్వారా పోవలసియున్ననేమి (2)
నీ రక్షకుండగు యేసే నడుపును
మారని తనదు మాట నమ్ము (2) ||సీయోను||
చరణం :ఐగుప్తు ఆశలనన్నియు విడిచి
రంగుగ యేసుని వెంబడించి (2)
పాడైన కోరహు పాపంబుమాని
విధేయులై విరాజిల్లుడి (2) ||సీయోను||
రంగుగ యేసుని వెంబడించి (2)
పాడైన కోరహు పాపంబుమాని
విధేయులై విరాజిల్లుడి (2) ||సీయోను||
చరణం :ఆనందమయ పరలోకంబు మనది
అక్కడనుండి వచ్చునేసు (2)
సీయోను గీతము సొంపుగ కలసి
పాడెదము ప్రభుయేసుకు జై (2) ||సీయోను||
అక్కడనుండి వచ్చునేసు (2)
సీయోను గీతము సొంపుగ కలసి
పాడెదము ప్రభుయేసుకు జై (2) ||సీయోను||
This song is available in you-tube
No comments:
Post a Comment