Search This Blog

Sunday, 21 July 2019

తరతరములకు యుగయుగములకు.......




తరతరములకు యుగయుగములకు నీవే దేవుడవు
తరగని కృపతో నీతనయునిగా మార్చిన నాధుడవు ||2||
కనికరపడుచు కరములు చాపి కౌగిలినిచ్చెదవు
కన్నవారిని మించిన ప్రేమ చూపిన దేవుడవు నీకే నీకే ఆరాధన - యేసు నీకే ఆరాధన ........ ||2||

చరణం:నిన్న నేడు మారనివాడవు నీవే యేసయ్య
ఎన్నటెన్నటికి ఏకరీతిగా వుండేవాడవయా
ఊహలకందని ఉన్నతుడా ఉన్నతస్థలములలో ఘనుడ ఉండువాడవు అన్ని వేళల నేవే యేసయ్య నీకే నీకే ఆరాధన - యేసు నీకే ఆరాధన ||తర||
చరణం:ఎంత చెప్పిన తరగని ప్రేమ నీదే యేసయ్య చెంత చేరి చింతలు బాపే దేవుడ నీవయ్యా ||2|| బండగా నడిచిన దేవుడా
అండగ నిలిచిన యేసయ్య ||2||
ఎండ వేళలో దాహము తీర్చే ఊటవు నేవేగా నీకే నీకే ఆరాధన - యేసు నీకే ఆరాధన ||తర||
చరణం:బాహుబలముతో బంధకములను తెంచినవాడవయ్యా బలహీనతలో కృపతో నింపే ఘనుడవు నీవయ్యా ||2|| అందరి దేవుడ నీవయ్యా
అందరికి ఉపకారివయ ||2||
అందరి కొరకు మరణం పొంది లేచినవాడవయా నీకే నీకే ఆరాధన - యేసు నీకే ఆరాధన ||తర||


This song is available in you-tubehttps://youtu.be/bQ8v6IQ5Lgo

4 comments: