పల్లవి : నీ కార్యములు ఆశ్చర్యములు దేవా || 4 ||
అ.ప : నీవు సెలవియ్యగా - సూన్యము సృష్టిగా మారేనె
నీవు సెలవియ్యగా - మారా మధురం ఆయనె
నీవు సెలవియ్యగా - దురాత్మలు పారిపోయేనె
నీవు సెలవియ్యగా - దరిద్రము తొలగిపోయేనె || 2 ||
చరణం : మోషే ప్రార్ధించగా - మన్నాను ఇచ్చితివే
ఆ మన్నా నీవే యేసయ్య
ఏలీయా ప్రార్ధించగా - ఆహారమిచ్చితివే
నా పోషకుడవు నీవే కదా ||2 ||
౹౹నీవు సెలవియ్యగా౹౹
చరణం : లాజరు మరణించగా - మరణము నుండి లేపితివే
మోడైనను చిగురింపచేసేదవు
కానాన్ వివాహము ఆగిపోవుచుండగా
నీ కార్యముతో జరిగించితివే
నీ కార్యముతో ..................... || 12 ||
సెలవిమ్మయ్య సెలవిమ్మయ్య - ఈ క్షణమే యేసయ్య || 8 ||
౹౹నీవు సెలవియ్యగా౹౹
౹౹నీ కార్యములు౹౹
No comments:
Post a Comment