Search This Blog

Saturday, 28 March 2020

( బయమేలరా ) నీ నావలో యేసు వుండగా





పల్లవి : నీ నావలో యేసు వుండగా బయమేలరా సోదరా
నీ పక్షమై యేసు వుండగా దిగులేలమ్మ సోదరీ || 2 ||
ఏ వ్యాధి ఏమి చేయలేదుగా సోలిపోకురా
ఏ మూలనా అది ఉన్నాను నీ దరికి రాదురా || 2 ||

చరణం : క్రుంగిపోకు అలసిపోకు యేసయ్య నీతోనుండగా
లోకమంతా చీకటి కమ్ముచున్న నీపై వెలుగుందిరా || 2 ||
నీకై తన కుమారున్ని పంపెను ఆ ప్రేమను చూడుమా
ఏ తెగులు నీ దరి చేరకుండా ఆ ప్రేమ ఆపును రా || 2 ||


చరణం : మోషేకు దేవుడు ప్రత్యక్షమైన స్థలము గుర్తుంన్నదా
మండుచున్న అ పొదను చూడుమా కాలిపోలేదుగా || 2 ||
ఏదైనా చేయగల దేవుడు తోడుండగా
నీ బయము విడచి ధైర్యముతో యేసయ్యను పాడరా || 2 || || నీ నావలో ||


This song is available in you-tube:
https://youtu.be/fNIIGJIv6NU

No comments:

Post a Comment