పల్లవి : వినరండి నా ప్రియుని విశేషము నా ప్రియుడు సుందరుడు మహాఘనుడు కనారండి నా ప్రియుని విశేషము నా వరుడు సుందరుడు మహాఘనుడు నా ప్రియుని నీడలో చేరితిని ప్రేమకు రూపము చూసితిని || 2 || ఆహ ఎంతో మనసంతా ఇక ఆనందమే తనువంతా పులకించి మహదానందమే || వినరండి ||
చరణం : మహిమతో నిండిన విధులలో బూరలూమోగే ఆకాశ పందిరిలో || 2 || జతగా చేరెదను ఆ సన్నిధిలో కురిసే చిరుజల్లై ప్రేమామృతము నా ప్రియా యేసు నను చూసి దరిచేరునే జతగా చేరేదెను నీ సంధిలో నా ప్రేమను ప్రియునికి తెలిపెదను కన్నీరు తుడిచేది నా ప్రభువే || వినరండి ||
చరణం : జగతికి రూపం లేనపుడు కోరెను నన్ను తన కొరకు నా ప్రభువు || 2 || స్తుతినే వస్త్రముగా ధరించుకొని కృపనే జయ ధ్వనితో కీర్తించెదను
నా ప్రభు యేసు చెంతన చేరెదను యుగమొక క్షణముగా జీవింతును || వినరండి ||
చరణం : తలపుల ప్రతి మలుపు గెలుపులతో నిలిచి శుద్ధ హృదయాల వీరులతో ఫలము ప్రతిఫలము నే పొందుకొని ప్రియ యేసు రాజ్యములో నే నిలిచెదను ఆ శుభవేళ నాకెంతో ఆనందమే నా ప్రియుడిని విడువను నేనెన్నడూ || వినరండి ||
This song is available in you-tube:
https://youtu.be/XR5A32-ne4M
No comments:
Post a Comment