పల్లవి : నా పైన నీకున్న ప్రేమ - నిను దోషిగా చేసెన్
ఆ ప్రేమయే నన్నిలా సజీవముగా - నిలిపెన్ || 2 ||
యే ప్రేమ సాటిరాదు - నీ సిలువ ప్రేమకు
ఎవరు సరిరారు - నీతో సరిపోల్చుటకు || 2 || || నా పైన ||
చరణం : నా పాప భారమంతా తీసివేయను -
ఆ సిలువ భారమంతా భరియించితివా
నా దోష శిక్షను తొలగించను -
ఆ ఘోర శ్రమలన్ని సహియించితివా || 2 ||
ఊహల కందనీ కార్యం ...
ఊహలకే మించిన త్యాగం .... || 2 || || నా పైన ||
చరణం : నీ కంటు ఏమి దాచుకోలేదయ్యా -
సర్వము నాకై ఆర్పించినావయ్యా
నిస్వార్ధమైన ప్రేమ నీదే యేసయ్య -
ఆ ప్రేమకు ఇలలోన సాటి ఎవరయ్యా || 2 ||
ఎడబాయనీ నీస్నేహం ....
విడనాడనీ నీ బంధం ...... || 2 || || నా పైన ||
This song is available in you-tube:
https://youtu.be/UIWoTHmpdT8
No comments:
Post a Comment