Search This Blog

Friday, 10 April 2020

నీవు కలిగిన కోరికకై...





పల్లవి : నీవు కలిగిన కోరికకై
వేలాది వందనాలయ్య నీవు చేసిన త్యాగముకై శతకోటి స్తోత్రములయ్యా అయ్యా బలియైనవా నా బ్రతుకు కోసం నీ ప్రాణం పెట్టావా నాపాపం కొరకు || 2 || నీ త్యాగమే మహా అద్భుతం అయ్యా నీ త్యాగమే వర్ణించలేం || 2 || || అయ్యా బలియైనవా ||

చరణం : విలువలేని నాజీవితాన్నే
మార్చుటకు నీవు బలియైయ్యవా మోడు బారిన నాజీవితన్నే చిగురింపజేయుటకు వెలియైయావా గొప్ప రక్షణ నాకివ్వాలని శుద్ధ రక్తాన్నే ధారబోసావా నీ శుద్ధ రక్తాన్నే ధారబోసావా అయ్యా బలియైనవా నా బ్రతుకు కోసం నీప్రాణం పెట్టావా నాపాపం కొరకు || 2 || నీ ఆశలకే వందనాలేసయ్యా నీ యాగానికే స్తోత్రాలేసయ్యా || 2 || || అయ్యా బలియైనవా ||

చరణం : నీ ముఖము మీద ఉమ్మి వేసిన నీ నిర్ణయాన్నే మార్చుకోలేదయ్యా మోయలేని భారాన్ని మోసిన ఇచ్చిన మాట తప్పలేదయ్య చిత్రహింసలే అనుభవించినా చావుకు నీవు తలవంచలేదయ్యా చావుకె నీవు తలవంచలేదయ్యా అయ్యా బలియైనవా నా బ్రతుకు కోసం నీప్రాణం పెట్టావా నాపాపం కొరకు || 2 || నా కోసమే కదా ఈ సిలువ యాగం నీ నిర్ణయమే గొప్ప సమర్పణ అయ్యా||2 ||
|| అయ్యా బలియైనవా ||

This song is available in you-tube:

No comments:

Post a Comment