Search This Blog

Friday, 10 April 2020

నీ త్యాగమే





పల్లవి : నీ త్యాగమే నే ధ్యానించుచూ నీ కోసమే ఇల జీవించెదా || 2 || నీతిమంతుడా షాలేము రాజా || 2 ||
ఆరాధన నీకే || 3 ||


చరణం : గడియ గడియకు నిన్ను గాయపరచితి గతమునే మరచి నిన్ను హింసించితి || 2 || అయినా విడువలేదు నీ కృపా నన్నెన్నడు మరువలేదు నీ ప్రేమ || 2 || || నీ త్యాగమే ||


చరణం : ఇహలోక ఆశలలో పడియుండగా
నీ సన్నిధి విడిచి నీకు దూరమవ్వగా || 2 || అయినా విడువలేదు నీ కృపా నన్నెన్నడు మరువలేదు నీ ప్రేమ || 2 || || నీ త్యాగమే ||


చరణం : హృదయమనే వాకిట నీవు నిలిచినా
నిన్ను కానకా నే కఠినుడనైతి || 2 || అయినా విడువలేదు నీ కృపా నన్నెన్నడు మరువలేదు నీ ప్రేమ || 2 || || నీ త్యాగమే ||


This song is available in you-tube:


No comments:

Post a Comment