Search This Blog

Thursday, 10 September 2020

చెమ్మగిల్లు కళ్ళలోన.....

    


పల్లవి : చెమ్మగిల్లు కళ్ళలోన కన్నీళ్లెంత కాలం
కష్టాల బాటలోనె సాగదు పయనం
అ . ప : విడుదల సమీపించెను నీకు వెలుగు ఉదయించును || 2 || ||చెమ్మగిల్లు ||



చరణం : నీవు మోసిన నిందకు ప్రతిగా - పూదండ ప్రభువు యిచ్చునులె నీవు పొందిన వేదనలన్ని - త్వరలో తీరిపోవునులె || 2 || నీ స్థితి చూసి నవ్వినవారే - సిగ్గుపడే దినమొచ్చేనులే విడుదల సమీపించెను నీకు వెలుగు ఉదయించును || 2 ||


చరణం :అనుభవించిన లేమి బాధలు - ఇకపై నీకు వుండవులే అక్కరలోన ఉన్నవారికి - నీవే మేలు చేసే వులే || 2 || మొదట నీ స్థితి కోంచమె ఉన్న - తుదకు వృద్ధిని పొందునులే విడుదల సమీపించెను నీకు వెలుగు ఉదయించును || 2 ||



This song is available in Youtube:

No comments:

Post a Comment