పల్లవి : వందనం వందనం వందనం దేవా వందనం "2"
చరణం : సర్వోనతుడా మహిమోన్నతుడా మహాఘనుడా వందనం
నీవే త్రిత్వం నీవే నిత్యం ఇదే సత్యం వందనం "2"
ప్రాణమా ఓ నా ప్రాణమా ప్రభువును మహిమపరచుమా..
"వందనం "
చరణం : తల్లి గర్బమునందు నేను నిర్మింపబడకముందే
నీ ప్రజలకు అధిపతిగ నన్ను నిర్మించుకొంటివే
గురిలేని గతిలేని దీన స్థితిలో నన్ను పిలచి
అణిచి మలచి దీవించి హెచ్చించి నీ సేవకై నిలిపావే
నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తేసే
మరణమైన జీవమైన క్రీస్తేసే
"వందనం "
చరణం :అడుగు అడుగుగా క్రమ క్రమముగా విస్తరింపజేసావు
పలు విధముగ సువార్త పరిచర్య అందింపజేసావు
నింద అయినా వేదన అయినా తోడునిచ్చి నడిపావు
కష్టమైన నష్టమైన సహాయకుడిగా నిలిచావు
నీ రాక వరకు ఫలించే క్రుపను నిమ్మయా
నీ ఆత్మతో ప్రకటింతు నీ సువార్త సత్యమును
యేసే సత్య మార్గము యేసులో నిత్య జీవము
నిత్యము నే నిరతము యేసుతో జీవింతును
No comments:
Post a Comment