Search This Blog

Thursday, 7 January 2021

ఘనమైనవి నీ కార్యములు..

 



పల్లవి : ఘనమైనవి నీ కార్యములు నా యెడల
స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్నివేళలా
అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే || 2 ||

చరణం : యే తెగులు సమీపించనీయక యే కీడైన దరిచేరనీయక
ఆపదలన్నీ తొలగే వరకు ఆత్మలో నెమ్మది కలిగే వరకు ​|| 2 || నా భారము మోసి బాసటగా నిలచి ఆదరించితివి
ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము ||ఘనమైనవి ||
చరణం :నాకు ఎత్తైన కోటవు నీవే నన్ను కాపాడు కేడెము నీవే
ఆశ్రయమైన బండవు నీవే శాశ్వత కృపకాధారము నీవే ​|| 2 || నా ప్రతిక్షణమును నీవు దీవెనగా మార్చి నడిపించుచున్నావు ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము ||ఘనమైనవి ||


చరణం : నీ కృప తప్ప వేరొకటి లేదయా నీ మనసులో నేనుంటే చాలయా
బహు కాలముగా నేనున్నా స్థితిలో నీకృప నా యెడ చాలునంటివే ​|| 2 || నీ అరచేతిలో నను చెక్కుకుంటివే నాకేమీ కొదువ ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము ||ఘనమైనవి .... ||


ఘనమైనవి....... స్థిరమైనవి.. ...... ||ఘనమైనవి ||



This song is available in Youtube:

No comments:

Post a Comment