పల్లవి : నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదన్
నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్ || 2 ||అ.ప. : అంతా నా మేలుకే - ఆరాధనా యేసుకే
అంతా నా మంచికే - తన చిత్తమునకు తల వంచితే || 2 ||
అరాధన ఆపను - స్తుతియించుట మానను || 2 ||
చరణం :కన్నీల్లే పానములైన - కఠిన దుఃఖ బాధలైన
స్థితిగతులే మారిన - అవకాశం చేజారిన
మారదు యేసు ప్రేమ - నిత్యుడైన తండ్రి ప్రేమ || 2 ||
మారదు యేసు ప్రేమ - నిత్యుడైన తండ్రి ప్రేమ || 2 ||
చరణం :ఆస్తులన్ని కోల్పొయిన - కన్నవారే కునుమరుగైన
ఊపిరి బరువైన - గుండెలే పగిలినా
యెహోవా యిచ్చెను - యెహోవా తీసికొనెను || 2 ||
ఆయన నామమునకే - స్తుతి కలుగు గాక || 2 ||
చరణం :అవమానం ఎంతైన - నా వారే కాదన్న
నీవు తప్ప ఎవరున్నారు ఆకాశమందునా ?
నీవు నా కుండగా - ఏది నాకక్కర లేదు || 2 ||
నీవు నా కుండగా - ఏది నాకక్కర లేదు || 2 || చరణం :ఆశలే సమాధియైన - వ్యాధి బాధ వెల్లువైన
అధికారము కొప్పుకొని - రక్షణకై ఆనందింతున్
నాదు మనస్సు నీ మీద - ఆనుకొనగ ఓ నాధా || 2 ||
పూర్ణశాంతి నే పొంది నిన్నే నే కీర్తింతున్ || 2 || చరణం :చదువులే రాకున్న - ఓటమి పాలైన
ఉద్యోగం లేకున్న - భూమికే బరువైన
నా యెడల నీ తలంపులు - ఎంతో ప్రియములు || 2 ||
నీవుద్దేశించినది నిష్ఫ్టలము కానేరదు || 2 ||
చరణం :సంకల్పాన పిలుపొంది - నిన్నే ప్రేమించు నాకు
సమస్తము సమకూడి - మేలుకై జరుగును
యేసుని సారూప్యము నేను పొందాలని || 2 ||
అనుమతించిన ఈ - విలువైన సిలువకై || 2 ||
చరణం : నీవు చేయునది - నాకిప్పుడు తెలియదు
ఇక మీదట నేను - తెలిసికొందును
ప్రస్తుతము సమస్తము - దుఃఖ కరమే || 2 ||
అభ్యసించిన నీతి - సమాధాన ఫలమే || 2 ||
This song is available in Youtube:
No comments:
Post a Comment