పల్లవి : విలువెలేని నా జీవితం, నీ చేతిలో పడగానే
అది ఎంతో విలువని నాకు చూపితివే
జీవమే లేని నాలో నీ జీవమును నుంపుటకు
నీ జీవితాన్నే దారబోసితివే || 2 ||
అ . ప : నీది శాశ్వత ప్రేమయ - నేను మరచిపోలేనయ
ఎన్ని యుగాలైన - మారదు..
ఎండిన ప్రతి మోడును మరల చిగురించును
నా దేవునికి సమస్తము - సాధ్యమే.... || 2 ||
చరణం : పాపములో పడిన నన్ను
శాపములో మునిగిన నన్ను నీ ప్రేమతో లేపితివే .
రోగమే నన్ను చుట్టుకొని యుండగ
రోధనతో ఒంటరినై యుండగ - నా కన్నీటిని. తుడిచితివే || 2 || || నీది శాశ్వత ||
చరణం : పగలంతా మేఘస్తంభమై, - రాత్రంతా అగ్నిస్తంభమై
దినమంతయు రెక్కలతో కప్పితివే....
స్నేహితులే నన్ను వదిలేసిన
బంధువులే భారమని తలచిన - నా కొరకే బలియైతివే. || 2 || || నీది శాశ్వత ||
బ్రిడ్డ్జ్ : సాధ్యమే.. సాధ్యమే... సాధ్యమే నా యేసుకు సమస్తము
సాధ్యమే.. సాధ్యమే... సాధ్యమే నా ప్రియునికి సమస్తము
ఎండిన ప్రతి మోడును - మరల చిగురించును
జీవమే లేని నాలో నీ జీవమును నుంపుటకు, నీ జీవితాన్నే దారబోసితివే || విలువెలేని ||
This song is available in Youtube:
No comments:
Post a Comment