Search This Blog

Monday, 7 February 2022

యేసు నీ అద్భుత ప్రేమ...

   


1. యేసు నీ అద్భుత ప్రేమ నేనేల మరిచెద దేవా
నీ ప్రేమ మాధుర్యమును రుచి చూచి యెరిగినవాడను
ఎండిన నా బ్రతుకులో జీవముగా నీవు చేరితివి నీ ప్రేమ జలములతో నను తడిపి బ్రతికించితివి

నీ వాత్సల్యమును - నీ కారుణ్యమును
స్మరియించుచు దేవా నే పాడేదనూ స్తుతి గీతము నే పాడేదనూ స్తుతి గీతము || 2 || ||నే పాడేదనూ ||
ఈ గీతము స్తుతిగీతము అంకితము నీకే ప్రభు కృతజ్ఞతతో నిను పొగిడెదను నే పాడుచు స్తుతిగీతము ||యేసు ||


2. పాపమును ఎరుగని దేవా నాకై పాపముగా మారి
నా వ్యసనములను భరియించి సిలువలో ప్రాణము విడిచితివి అమూల్యమైన నీ రక్తముచే నను నీవు విమోచించితివి నీ ప్రేమ లోతులలో శాశ్వతముగా నను బందించితివి

          నీ కల్వరి యాగం - కనపరచిన ప్రేమ
తలపోయుచు దేవా నే పాడేదనూ స్తుతి గీతము నే పాడేదనూ స్తుతి గీతము || 2 || ||నే పాడేదనూ ||
 
ఈ గీతము స్తుతిగీతము అంకితము నీకే ప్రభు కృతజ్ఞతతో నిను పొగిడెదను నే పాడుచు స్తుతిగీతము||యేసు ||





No comments:

Post a Comment