పల్లవి : కరుణాసంపన్నుడా ధీరుడా సుకుమారుడా
నీ ప్రభావ మహిమలనే నిరంతరం నేను ప్రకటించెద "2"
నా పైన ప్రేమ చూపించి నా కొరకు త్యాగమైతివే
నా యేసయ్యా సాత్వికుడా
నీ కోసమే నా జీవితం "2""కరుణాసంపన్నుడా"
నీ ప్రభావ మహిమలనే నిరంతరం నేను ప్రకటించెద "2"
నా పైన ప్రేమ చూపించి నా కొరకు త్యాగమైతివే
నా యేసయ్యా సాత్వికుడా
నీ కోసమే నా జీవితం "2""కరుణాసంపన్నుడా"
చరణం : ఏనాడు నను వీడని నీ ప్రేమ సందేశము
నా హృదయసీమలోనే సందడిని చేసెను "2"
అణువణువును బలపరచే నీ జీవిపు వాక్యమే
ప్రతిక్షణము దరి చేరి నన్నే తాకెను "2"
ఆ వాక్యమే ఆరోగ్యమై జీవింపజేసే నన్నే నడిపించెను "కరుణాసంపన్నుడా"
చరణం :ఈ వింత లోకంలో నీ చెంత చేరితిని
ఎనలేని ప్రేమతోనే ఆదరణ పొందితిని "2"
నీ కృపలో నిలిపినది - నీ ప్రేమబంధమే
అనుదినము మకరందమే - నీ స్నేహబంధము "2"
ఆ ప్రేమలోనే కడవరకు నన్ను నడిపించుమా స్థిరపరచుమా "కరుణాసంపన్నుడా"
చరణం : నే వేచియున్నాను నీ మహిమ ప్రత్యక్షతకై
నాకున్నా ఈ నిరీక్షణే సన్నిధిలో నిలిపినది "2"
నా కోసం నిర్మించే సౌందర్యనగరములో
ప్రణమిల్లి చేసెదను నీ పాదాభివందనం "2"
తేజోమయా నీ శోభితం నే పొందెద కొనియాడెద "కరుణాసంపన్నుడా"
Clink on this link for song
No comments:
Post a Comment