పల్లవి : నీ పిలుపు వలన నేను నశించిపోలేదు
నీ ప్రేమ ఎన్నడు నన్ను విడువలేదు
నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను
నీ ప్రేమకు సాటి లేదు "2"
చరణం : నశించుటకు ఎందరో వేచియున్నను
నశింపని నీ పిలుపు నన్ను కాపాడెను
ద్రోహము నిందల మధ్యలో నే నడిచినను
నీ నిర్మల హస్తము నన్ను భరియించును
యజమానుడా నా యజమానుడా ...
నన్ను పిలచిన (నడిపించే) యజమానుడా "2"
చరణం : మనుషులు మూసిన తలుపులు కొన్నేనను
నాకై నీవు తెరచినవి అనేకములు
మనోవేదనతో నిన్ను విడిచి పరుగెత్తినను
నన్ను వెంటాడి నీ సేవను చేసితివి
నా ఆధారమా నా దైవమా
పిలిచినా ఈ పిలుపునకు కారణమా "2"
చరణం : పిలచిన నీవు నిజమైన వాడవు
నన్ను హెచ్చించే ఆలోచన గలవాడవు
ఏదేమైనను కొనసాగించితివి
నీపై ఆధారపడుటకు అర్హుడవు
నిన్ను నమ్మేదను ,వెంబడింతును
చిరకాలము నిన్నే సేవింతును "2"
"నీ పిలుపు "
No comments:
Post a Comment