Search This Blog

Saturday, 30 July 2022

మరిచిపోలేదే...


  

పల్లవి :మరిచిపోలేదే మమ్మును ఎపుడు యేసయ్య
తొలగిపోనీక మాపైనుండి నీ దయ  "2"
నీ ప్రేమకు కొలతే లేదయా
ఏమిచ్చినా ఋణము తీరదయా
నిన్నే స్తుతియించెదమయ్యా
అ. ప : మాకు కాదు ఏ మాత్రమును            
             నీ నామమునకే మహిమ కలుగును    "2"
"మరచి"

చరణం : నెరవేర్చితివి పనులన్నిటిని
ఫలమేమి పోనీయలేదే "2"
                 ఆశీర్వదించినావే - మమ్మాశీర్వదించినావే
సహాయము కేడెము నీవే  "2"
"మాకు"
చరణం : బదులిచ్చితివి మొరలన్నిటికి
తలదించుకోనీయలేదే "2"
                 అభివృద్దిచేసినావే - మమ్మభివృద్దిచేసినావే
సహాయము కేడెము నీవే  "2"
"మాకు"

చరణం : గెలిపించితివి ప్రతి సమరములో
అపకీర్తి రానీయలేదే "2"
                 ఆనందపరచినావే - మమ్మానందపరచినావే
సహాయము కేడెము నీవే  "2"
"మాకు"

                                                                       

No comments:

Post a Comment