పల్లవి : నా తోడు నీవు నిలచితివే నీ ప్రేమ నాపై చూపితివే "2"
నను వెంటాడే నీ కృప క్షేమములే
నను వెంటాడే నీ కృప క్షేమములే
నను కాచే నీ కరుణ కటాక్షములే "2"
అ.ప :యేసయ్యా .. నీకే స్తోత్రము యేసయ్యా .. నీకే స్తోత్రము "2"
"నా తోడు "
చరణం : అగ్ని గుండములో సింహపు బోనులో
నను రక్షించే వారెవరు లేక, నే ఒంటరినై వున్నవేలా .
నిలచావు నాకై తోడుగా
నిలిపావు నన్ను నీదు సాక్షిగా. "2"
నను చేసావు నీ రక్షణకే రుజువుగా .
"యేసయ్యా"
చరణం : అనారోగ్యములో వ్యాధిబాధలో
నను స్వస్థపరచు వారెవరు లేక ,నే వేదనలో క్రుంగియున్నవేలా .
తాకావు నన్ను నీ చేతితో
స్వస్థపరిచావు నన్ను నీదు వాక్కుతో .
నను చేసావు నీ ప్రేమతో పరిపూర్ణముగా .. "2"
No comments:
Post a Comment