Search This Blog

Tuesday, 30 August 2022

పల్లెపల్లెనా సువార్త...

 


పల్లవి : పల్లెపల్లెనా సువార్త పనులే జరగాలి
పట్టణాలలో ప్రభూ సభలే చెయ్యాలి "2"

             ప్రజలందరూ ప్రభుని నమ్మాలి
పరలోకమే ఉన్నదని తెలియాలి
            మరణించిన మనిషికి బ్రతుకు వుందని
మహానీయులకు తెలియాలి
క్రీస్తు ద్వారానే స్వర్గముందని
ప్రతి మనిషి తెలుసుకోవాలి  "పల్లెపల్లెన "

చరణం : పెందలకడ నీవు లేచి
అందరితో నీవు కలిసి
క్రీస్తు మరణం పునరుత్ధానం
ప్రకటించుచు పనులు చేస్తూ
అందమైన లోకముందని
ఆయుష్షు ప్రభుకై ఖర్చుచేసి
నిత్యజీవం పొందుకొనుమని
ప్రకటించుచు సాక్షర్దమై

క్రీస్తేసులా ప్రభుని ఘనపరిచి
జీవితంలోనా మాదిరి చూపి
నిందారహితుడవై క్రియలు చేయుచు
సత్యముగా బ్రతకాలి
ఎదుటివారికి మేలు చేయుచు
కీడుచేయక బ్రతకాలి "పల్లెపల్లెన "

చరణం : గొప్ప గొప్ప సభలు చేసి
వేల మందిని కూర్చోబెట్టి
తండ్రి ప్రేమను తెలియచేసి
మనిషి ప్రేమ చిన్నదనియు
మనసులోన ఉన్న మలినం
వాక్యముతో పారద్రోలి
మాయలోకం మనదికాదని
మంచి అంటే వాక్యమేనని

పేతురు పౌలులా వాక్యము తెలిపి
వాస్తవమైనా జీవితం ఉందని
సందేహములో ఉన్నవారిని
సత్యములో నడపాలి
అగ్నిలో నుండి రక్షించే
ఆదరణ నీవు చూపాలి "పల్లెపల్లెన "


  

No comments:

Post a Comment