పల్లవి : ఊహకు అందని రీతిలో నన్ను ప్రేమించావు
వర్ణన కందని రీతిలో నను దీవించావు "2"
అ. ప : నీ ఋణము ఎలా తీర్చగలను యేసయ్యా...
ఏమిచ్చిన సరిపోదు నా యేసయ్యా... "2"
యేసయ్యా... యేసయ్యా... యేసయ్యా... నా యేసయ్యా... "2"
చరణం : ఒంటరిగా ఉన్న నన్ను ఆదరించినావు
నీ వాక్కుతో నన్ను నీవు బ్రతికించినావు "2"
చీకటిలో ఉన్న నాకు... వెలుగునిచ్చినావు "2"
"నీ ఋణము"
చరణం : పాపములో ఉన్న నన్ను విమోచించినావు
శాపములో ఉన్న నాకు విడుదలిచ్చినావు "2"
మరణము తప్పించి... జీవమిచ్చినావు "2"
"నీ ఋణము"
No comments:
Post a Comment