Search This Blog

Monday, 2 January 2023

అతిపరిశుద్ధుడా ....

 


పల్లవి : అతిపరిశుద్ధుడా స్తుతినైవేద్యము
నీకే అర్పించి కీర్తింతును
నీవు నా పక్షమై నను దీవించగా .....
నీవు నా తోడువై నను నడిపించగా
జీవింతును నీకోసమే ఆశ్రయమైన నా యేసయ్యా "అతిపరి"

చరణం :సర్వోన్నతమైన స్థలములయందు నీ మహిమ వివరింపగా
ఉన్నతమైన నీ సంకల్పము ఎన్నడు ఆశ్చర్యమే "2" ముందెన్నడూ చవిచూడని సరిక్రొత్తదైన ప్రేమామృతం "2" నీలోనే దాచావు ఈనాటికై నీ ఋణం తీరదు ఏనాటికి "2" "అతిపరి"

చరణం :సద్గుణరాశి నీ జాడలను నా యెదుట నుంచుకొని గడిచిన కాలం సాగిన పయనం నీ కృపకు సంకేతమే "2" కృపవెంబడి కృపపొందగా మారాను మధురముగా నే పొందగా "2" నాలోన ఏ మంచి చూసావయ్యా నీప్రేమ చూపితివి నా యేసయ్యా "2" "అతిపరి"

చరణం :సారెపైనున్న పాత్రగ నన్ను చేజారిపోనివ్వక
శోధనలెన్నో ఎదిరించినను నను సోలిపోనివ్వక "2" ఉన్నావులె ప్రతిక్షణమునా కలిసి ఉన్నావులె ప్రతిఅడుగున "2" నీవెగా యేసయ్యా నా ఊపిరి నీవెగా యేసయ్యా నా కాపరి "2" "అతిపరి"

2 comments:

  1. I'm searching for this song i found i this website thanks for sharing..

    ReplyDelete
    Replies
    1. Praise the lord , you are welcome Brother.

      Delete