పల్లవి : బ్రతికియున్నానంటే నీ కృప
జివిస్తున్నానంటే ఈ కృప || 2 ||
ఏ యోగ్యత నాలో లేదు
ఎంత భాగ్యము నిచ్చావు
పరిశుద్ధత నాలో లేదు
నీ ప్రేమను చూపావు || 2 ||
యేసయ్యా నా యేసయ్యా ....
యేసయ్యా నా యేసయ్యా ... || 2|| || బ్రతికి ||
చరణం : నా జీవిత నావ సాగుచుండగా
తుఫానులు వరదలు విసిరికొట్టగా
కదలలేక నా కధ ముగించబోగ
నీవు పదా అంటూ నన్ను నడిపినావు
సదా నిన్నే సేవిస్తూ సాగిపోయేదా
నీ పాదాల చెంతనే వాలిపోయేదా || 2 || ||యేసయ్యా ||
చరణం : నా జీవితమంతా ప్రయాసలుపాడగా
శోధనల సంద్రంలో మునిగిపోగా
నా ఆశల తీరం అడుగంటిపోగా
ఆప్యాయత చూపి ఆదరించినావు
నీ కృపతోనే నా బ్రతుకు ధన్యమైనది
నీ కృపలేనిదే నేను బ్రతుకలేనయ్యా || 2 || ||యేసయ్యా ||
చరణం : నా జీవితములో శ్రమలేదురవగా
వేదనతో నా గుండె కలవరపడగా
భయముతో నా హృదయం బరువైపోగా
బలమిచ్చి ఈ భువిలో నన్ను నిలిపినావు
ఈ లోకములో అన్ని గతించిపోవును
నీ కృపయే తరతరములు నిలుచును యేసయ్యా || 2 || ||యేసయ్యా ||
This song is available in you-tube
LINK: https://youtu.be/CVGjbJ3Bhvw
No comments:
Post a Comment