పల్లవి :నా రూపమే - ఒక ప్రత్యేకమే
నీ సృష్టిలో - నేను ఒక భాగమే నా రూపమే - నీ ప్రతి రూపమే దూత్తాలికే - లేని అపురూపమే జగతికి పునాది లేదే - నీ ఊహల్లోనా నేనే
తల్లి గర్భము లోన - నను నిర్మించినది నీవే ... || 2 || ||నా రూపమే||
చరణం :కలతలు నిండిన లోగిలిలో - మమతల వెల్లువ నింపావు
కరుణను మరచిన నా హృదికి - కలువరి సిలువను చూపావు ... || 2 ||
బాధల లోయల లోనా - భారాల తీరానా
ప్రేమించినది నీవే - నను రక్షించినది నీవే... || 2 || ||నా రూపమే||చరణం :తడబడు అడుగులు సరిచేసి - నిలబడు బలమును ఇచ్చావు
పదిలాముగా నను పట్టుకుని - కదలని బండపై నిలిపావు... || 2 ||
పరిశుద్దతయు నీవే - నా ప్రాణ దీపం నీవే
నా పరవశమంతా నీవే - నా ప్రతికూలతలో నీవే.... || 2 || ||నా రూపమే||
This song is available in Youtube:
No comments:
Post a Comment