పల్లవి : పక్షిరాజువలె రెక్కలు చాపి పైకెగురుదామా
అలయక , సొమ్మసిల్లాక పైకెగురుదామా "2"
అలయక , సొమ్మసిల్లాక పైకెగురుదామా "2"
ఆ… శాశ్వత లోకము కొరకు నిత్య రాజ్యము కొరకు "2" "పక్షిరాజు"
చరణం : యీ లోక స్నేహితులు యీ లోక బంధువులు
జన్మనిచ్చిన తల్లిదండ్రులు ..... "2"
ఎవరు లేక ఒంటరి స్థితిలో ప్రేమలన్ని కోల్పోయిన "2"
క్రీస్తు యేసు ప్రేమలో సాగిపోదామా "2"
చరణం :యీ లోక పోరాటము సాతాను శోధనలు
హృదయమును కృంగదీసినా.... "2"
అడుగడుగునా సంకెళ్లతో అడుగు వేయలేకున్నా "2"
క్రీస్తు యేసు ప్రేమలో ఎగిరిపోదామా
చరణం :ఆ మహిమ రాజ్యములో ఆ నిత్య రాజ్యములో
కన్నీరుండదు దిగులుండదు... "2"
ఎల్లప్పుడూ సంతోషముతో ఎల్లప్పుడూ ఆనందముతో "2"
హల్లెలూయా గీతాలతో నిలిచిపోదామా "2" "పక్షిరాజు"
No comments:
Post a Comment