పల్లవి : ఉన్నవాడవు అనువాడవు నీవు
నిన్న నేడు నిరతము మారని మా యేసయ్య "2"
అ. ప : అల్ఫాయు ఓమేఘయు నీవే కదా
అధ్యంతరహితుడవు నీవే కదా "2"
హల్లేలూయా స్తోత్రార్హుడా
యుగయుగములకు స్తుతిపాత్రుడా "2"
"ఉన్నవాడవు "
చరణం : పలుకబడిన వాక్కుతో ప్రపంచములు నిర్మించితివి
మంటితో మమ్ము చేసి జీవాత్మను ఊదితివి "2"
మమ్మునెంతో ప్రేమించి మహిమతో నింపితివి
పరము నుండి దిగివచ్చి మాతో నడిచితివి "అల్ఫాయు"
చరణం : పాపమంటియున్న మాకై మా పరమ వైద్యునిగా
నీ రుధిరం మాకై కార్చి ప్రాయశ్చిత్తం చేయగా "2"
మొదటివాడా కడపటివాడా జీవింపజేసితివే
నీదు ఆత్మతో నింపితివి మము సరిచేసితివి "అల్ఫాయు"
చరణం : ప్రతివాని మోకాలు వంగును నీ నామమున
ప్రతివాని నాలుక చాటును నీ మహిమను "2"
తరతరములకు మమ్మేలువాడ భూపతుల రాజువే
మేఘారుడుడై దిగివచ్చి మహినేలు మహారాజువే "అల్ఫాయు"
No comments:
Post a Comment