Search This Blog

Friday, 30 September 2022

నీ మేలులు వివరింపతరమా...

  


పల్లవి : నీ మేలులు వివరింపతరమా ప్రభువా  
నీ కృపలను నే మరువగలనా                  "2"
            
అ. ప : ఆదరించావు అగాపే ప్రేమతో
ఆదుకున్నావు నీ జాలి మనసుతో - నీ జాలి మనసుతో   
                                "నీ మేలులు "

చరణం :శోధనలే నన్ను వెన్నంటివున్నా
బహు శ్రమలతో నేను సతమతమవుతున్నా "2"
               నను ధైర్యపరచి నడిపించినావే
నా హృదయవేదన తొలగించినావే   "ఆదరించావు"

చరణం :ఊహించలేని కార్యాలు ఎన్నో
లేకించలేని పర్యాయములలో "2"
               నా జీవితంలో జరిగించినావే
నీ కృపతో నిత్యము దీవించినావే   "ఆదరించావు"

చరణం :మరచిపోలేని నీ మేలులెన్నో
దయచేసినావే నా జీవితంలో "2"
               నీ ప్రేమకు సాటి లేదేది ఇలలో
నీ కరుణకు బదులు ఏముంది ధరలో   "ఆదరించావు"



No comments:

Post a Comment