Search This Blog

Friday, 5 April 2019

గతకాలమంత నీ నీడలోన...

 

పల్లవి : గతకాలమంత నీ నీడలోన - దాచావు దేవా వందనం
కృప చూపినావు - కాపాడినావు
ఎలా తీర్చగలను నీ ఋణం
పాడనా నీ కీర్తన - పొగడన వేనోళ్ళన "2"
            
అ ప. : వందనం యేసయ్యా - ఘనుడవు (విభుడవు) నీవయ్యా"2"
 "గతకాలమంత "


చరణం : ఎన్నెన్నో అవమానాలెదురైనను
నీ ప్రేమ నన్ను విడచిపోలేదయ్యా
ఇక్కట్లుతో నేను కృంగినను
నీ చేయి నను తాకి లేపెనయ్యా
నిజమైన నీ ప్రేమ నిష్కళంకము
నీవిచ్చు హస్తము నిండు ధైర్యము "2"    
  "వందనం "

చరణం : మాటలే ముళ్ళుగా మారిన వేళ
నీ మాట నన్ను పలకరించేనయ
నిందలతో నేను నిండినవేళ
నీ దక్షిణ హస్తం నన్ను తాకేనయ

నీ మాట చక్కటి జీవపు ఊట
మరువనెన్నడు నిన్ను స్తుతియించుట "2"    
  "వందనం "
                         

No comments:

Post a Comment