పల్లవి : నీ కృప నేనేమైనా ...
నీ కృప నాకేమైనా ...
నీ కృప నీతో ఉన్నా...
నీ కృప నేనిల ఉన్నా ...
ఆదరించు దైవం నీవు ఇమ్మానుయేలు దేవా "2"
ఆత్మాభిషేకతైలం నాపై కురిపించవా ...
అ.ప :ఆరాధించెదనయ్య నీ సన్నిధి చేరెదనయ్య "4"
నిరతము నా ఆశ్రయం నీవే యేసయ్యా
"నీ కృప"
చరణం :ఎన్నదగిన వాడిని కాను - మంటి పురుగును నేను
నన్ను నన్నుగ ప్రేమించిన నిన్ను నేను మరిచాను "2"
అయినను నను వీడలేదయ్యా నీ కృపా ...
చెంతచేరి నా చెలిమి కోరెను నీ కృపా ... "2"
"ఆరాధించె"
చరణం :పరిశుద్దుడనసలే కాను - పుట్టుకతో పాపిని నేను
ఫలియించని మోడుగ ఎదిగి దారితప్పి నే తిరిగాను "2"
అయినను నను మరువ లేదయ్యా నీ కృపా ...
పరము విడిచి ప్రాణము పెట్టెను నీ కృపా ... "2"
"ఆరాధించె"
చరణం :బ్రతుకు భారమవుతున్నా - బాధ్యతలే నేను మరిచినా
నీ మాటలు వింటూనే విశ్వాసము చూపకుండినా "2"
అయినను నా చేయి పట్టెను నీ కృపా ...
నడిపించి నను గెలిపించినది నీ కృపా ... "2"
"ఆరాధించె"
No comments:
Post a Comment