Search This Blog

Tuesday, 13 September 2022

పూజార్హుడవు...

 


పల్లవి : పూజార్హుడవు పూర్ణాత్ముడవు
నా హృదయ పాలకుడా
అ. ప : ఎన్నికలేని నన్నూ నీ అరచేతులలో నను చెక్కుకున్నావు   "2"
 "పూజా"


చరణం : దేవా నా దేవుడవు నీవే
నా హృదిలో నివశించే నా ప్రభూ "2"
              నా అంతరంగములో నివశించు వాడవు నీవే దేవా
నా అంతరంగములో నివశించు వాడవు నీవే ప్రభువా "ఎన్నికలేని "


చరణం : వేకువనే వెదకెదను నీ సన్నిధినీ
నా స్తుతికి కారణభూతుడా "2"
                ఆకాశమందు ఆశీనుడైనవాడ నీ తట్టు కన్నులు ఎత్తుచుంటినీ "2"
 "ఎన్నికలేని "


                                  

No comments:

Post a Comment