పల్లవి : దాక్షిణ్యపూర్ణుడా - అత్యంత శ్రేష్టుడా
నా స్తుతికి కారణభూతుడవైన ప్రాణప్రియుడా "2"
నీ నామమునకే మహిమ కలుగును గాక "2"
అ. ప : స్తోత్రములు నిత్యము దయాళుడా
నీ క్రియలు సత్యము సహాయుడా "2"
"దాక్షిణ్య"
చరణం : కష్టకాలమున నీకు మొరపెట్టిన
ఆపదలనుండి విడిపించిన నాధుడా "2"
నీ వాక్కును పంపించి దర్శించి బాగుచేసి"2"
ఆశ్చర్యకార్యాలు చేసిన దేవుడా "2"
"స్తోత్రములు"
చరణం : శ్రమల సంద్రమున నీకు మొరపెట్టిన
తరంగాల పొంగు అణిచేసిన నాధుడా "2"
ఆ బాధను పోగొట్టి చేయిచ్చి లేవనెత్తి "2"
చేరాల్సిన రేవునకు నడిపిన దేవుడా "2"
"స్తోత్రములు"
చరణం : దు:ఖభారమున నీకు మొరపెట్టిన
చీకటిలోనుండి రప్పించిన నాధుడా "2"
జలధారలు పుట్టించి సమృద్ధి కలుగజేసి "2"
దీవించి సంతోషపరచిన దేవుడా "2"
"స్తోత్రములు"
No comments:
Post a Comment