Search This Blog

Monday, 26 September 2022

నీ సన్నిధిలో ఆనందమే...


 


పల్లవి : నీ సన్నిధిలో ఆనందమే - నీ సేవలోనే సంతోషమే "2"
అ. ప : స్తుతులందుకో స్తోత్రార్హుడా - పదివేలలో అతిసుందరుడా
కరుణించుమా కరుణామయా - మహిమ ఘనత నీకే దేవా   
"నీ సన్నిధిలో "


చరణం : మా హృదయాలను నీ ఆలయముగా
నీ ఆలయమే మా దాగు చోటుగా "2"
               నీ చిత్తము మాలో నేరవేరగా
పరిపూర్ణమైన నీ ప్రేమ పొందగా "2"
కృప చూపుము దేవా - దీవించు ప్రభువా
నీ ఆత్మ శక్తితో నింపుము దేవా
కరుణించుమా కరుణామయా - మహిమ ఘనత నీకే దేవా
"నీ సన్నిధిలో "

చరణం : నీ మహిమార్దమే మా క్రియలన్నియు
నీ కనికరములే మేలులన్నియు "2"
               విశ్వాసముతో ప్రార్ధింప నేర్పుమా
నీ వాక్య వెలుగులో దర్శించుమా "2"
దరిచేర్చు ప్రభువా - పరలోక దేవా
కడవరకు మమ్ము నడిపించుమా
కరుణించుమా కరుణామయా - మహిమ ఘనత నీకే దేవా
"నీ సన్నిధిలో "





No comments:

Post a Comment