Search This Blog

Monday, 26 September 2022

యేసు కోసమే జీవిద్దాం ...

 

  


పల్లవి : యేసు కోసమే జీవిద్దాం - యేసుతోనే పయనిద్దాం
యేసుని పోలి నడిచే సాక్షులం
యేసు విలువలు కలుగుందాం - యేసు పిలుపునకు లోబడదాం
లోకములో యేసుని ప్రతినిధులం

శోధనలేదురైనా అవరోధములేన్నున్న
విశ్వాసములో నిలకడగా నిలిచుందాం కడవరకు
నీ జీవిత యాత్రలో లోతులు కనబడినా
లోబడకుందుము లోకముకు ఏ సమయములోనైన "యేసు "

చరణం : నిందారహితులుగా జీవించుట మన పిలుపు
నీతియు పరిశుద్ధతయు ప్రభు కోరే అర్పణలు
               యధార్దవంతులుగా ఒక మంచి సాక్ష్యము
లోకమునకు కనపరచుటయు దేవుని పరిచర్యే
ప్రేమయు సహనము యేసుని హృదయము
కలిగుండుటకు పోరాడేదం ఆశతో అనుదినము
"యేసు "

చరణం : యేసు స్వభావమును ధరించిన వారలము
మరణం గెలిచిన క్రీస్తుని ప్రకటించే శిష్యులము
               సంకటములు ఎదురైనా అవి అడ్డుగా నిలిచినను
రోషముగల విశ్వాసముతో ఆగకనే సాగెదము
రాజులు జనములు యేసుని చూచెదరు
విశ్వాసులు విశ్వాసములో స్ధిరముగా ఉన్నపుడు
"యేసు "



No comments:

Post a Comment