Search This Blog

Tuesday, 27 September 2022

దేవుని యిల్లు...

 


పల్లవి : దేవుని యిల్లు దేవుని యిల్లు
ప్రేమానురాగాలు పంచె - మమతానురాగాలు ఒలికెంచె
అ. ప : ఆహ! నాకెంతో ఆనందమే యేసయ్య ఇంటిలో
నివసించుటే నాకు ధన్యము - నివసించుటే నా భాగ్యము   "2"
 "దేవుని"

చరణం : నీ పాదపద్మములపై ఒరిగి నీ సన్నిధిలో
నిలిచి యుండుటే నా ధన్యత "2"
               యేసయ్య పాదాలచెంతా స్థలములో ఉండుటే నా ధన్యత "2"


చరణం : నీ బాహుబలముతో చేర్చి నీ కౌగిటిలో
దాచి యుండుటే నా భాగ్యము "2"
               నీ కృప నాకుంటే చాలయ్యా అదియే ఇలలో నా భాగ్యము "2"


చరణం : నీ కృపా వాత్సల్యము చూపి నీ సాక్షిగా
నను నడిపినది నీ ప్రేమగా "2"
              యేసయ్య నీతోనే జీవించుచూ నీ ప్రేమనే ప్రకటించెదా "2"



No comments:

Post a Comment