పల్లవి : నా ప్రాణమా నాలో నీవు ఎందుకో క్రుంగియున్నావు
యెహోవాయందే ఇంకను నిరీక్షణ ఉంచుము నీవు "2"
చరణం : ఈతి బాధల్ కఠినశ్రమలు
అవమానములే కలిగినవేళ
నీ కొరకే బలియైన యేసు
సిలువన్ చూచి తలపోయుమా
అల్పకాల శ్రమల పిదప
మహిమతో నిను నింపును నా ప్రాణమా "2"
"నా ప్రాణమా"
చరణం : ఆప్తులంతా నిను విడిచిననూ
శత్రువులే నీపై లేచిననూ
తల్లియై నా మరిచినామరుచున్
నేను నిన్ను మరువాననినా
యేసుని ప్రేమన్ తలపోయుమా
ఆశ్రయించు ప్రభుని నా ప్రాణమా "2"
"నా ప్రాణమా"
చరణం : ఐశ్వర్యమే లేకున్ననూ
సౌఖ్యజీవితమే కరువైననూ
ప్రభు సేవలో ప్రాణములనే
అర్పించవలసి వచ్చిననూ
క్రీస్తునకే అంకితమై ఆనందించు
ప్రభు రాకకై కనిపెట్టుమా నా ప్రాణమా "2"
"నా ప్రాణమా"
No comments:
Post a Comment