Search This Blog

Wednesday, 8 March 2023

ఏదో ఆశ నాలో....

 


పల్లవి : ఏదో ఆశ నాలో నీతోనే జీవించనీ "2''
యేరై పారే ప్రేమ నాలోనే ప్రవహించనీ మితిలేని ప్రేమ చూపించినావు శృతి చేసి నన్ను పలికించినావు ఈ స్తోత్రగానం నీ సొంతమే



చరణం : పరవాసిననైన కడుపేదను నాకేల ఈ భాగ్యము
పరమందు నాకు నీ స్వాస్థ్యము నీవిచ్చు బహుమానము "2" తీర్చావులే నా కోరిక తెచ్చానులే చిరుకానుక అర్పింతును స్తుతిమాలిక
కరుణామయా నా యేసయ్య


చరణం : నీ పాదసేవ నే చేయనా నా ప్రాణమర్పించనా
నా సేద తీర్చిన నీ కోసమే ఘనమైన ప్రతిపాదన "2" ప్రకటింతును నీ శౌర్యము కీర్తింతును నీ కార్యము చూపింతును నీ శాంతము 
తేజోమయా నా యేసయ్య


Friday, 20 January 2023

లంగరేసినావా నా నావకు....

 


పల్లవి : లంగరేసినావా నా నావకు
కొట్టుకొని పోకుండా నే చివరకు
లంగరేసినావా నా నావకు
పట్టు జారిపోకుండ నా బ్రతుకుకు
అలలను అదిమిపెట్టి అలజడి అనగగొట్టి
తీరం చేరేదాక నావలోన అడుగు పెట్టి కలవరమిడిచిపెట్టి కలతను తరిమికొట్టి ఊపిరి ఆగేదాకా ప్రేమ తోనే చంక బెట్టి
లోక సంద్రాన నా జీవ నౌక
అద్దరికి చేరేదాక సాగు గాక నీ దరికి చేరేదాక సాగు గాక

చరణం : చుట్టు వున్న లోకం మాయదారి / మాయ సుడిగుండం
నట్టనడి సంద్రాన పట్టి లాగే వైనం "2"
రాకాసి అలలెన్నో ఎగసి ఎగసి పడుతుంటే
ముంచేసి నను చూస్తూ మురిసి మురిసి పోతుంటే
               నా ఆశలన్ని కరిగి వంటరిగా నేనుంటే
నిరాశ వలలు తెంపి నిరీక్షణతో నను పిలిచె చూశాను నీ వైపు... "2" ఆహా ఎంత చల్లిని చూపు ఆహా ఎంత చల్లని నీ చూపు "అలలను"


చరణం : సందేహాల గాలి తుఫాను సాగనీక ఆపుతుంటే
సత్య వాక్య జాడలేక ఓడ బ్రద్దలౌతుంటే "2" శోధన కెరటాలే ఎగిరి ఎగసి పడుతుంటే వేదన సూడులెన్నో తరిమి తరిమి కొడుతుంటే యే దారి కానరాక దిక్కులేక నేనుంటే నీ దారి నేనంటూ నడిచినావు నా వెంటే
చూశాను నీ వైపు... "2" ఆహా ఎంత చల్లిని చూపు ఆహా ఎంత చల్లని నీ చూపు "అలలను"


చరణం : జీవవాక్కు చేతబట్టి నీ చిత్తాన్ని మదిన బెట్టి
జీవదాత నీదు సేవే జీవితానికర్ధమంటూ "2" నా వెనుక వున్నవి మరచి ముందున్న వాటిని తలచి నేత్రశ శరీరాశ జీవపుడంబాన్ని విడచి నిను జేరరమ్మంటూ జగమంతా నే పిలచి క్రీస్తేసు కృపలో నిలిచి పాపపు లోకాన్ని గెలిచి
చూశాను నీ వైపు... "2" ఆహా ఎంత చల్లిని చూపు ఆహా ఎంత చల్లని నీ చూపు "అలలను" "లంగరేసి"





Sunday, 15 January 2023

యేసు నీ త్యాగమే ...



పల్లవి : యేసు నీ త్యాగమే నా పాప శిక్షకై "2"
ఎన్నో నిందలు అవి నా కోసమా
మలినమైన నా గతం ఇక లేదయా "2"

నా జీవితమే నీదేనయా - నాకంటూ ఏమొదయ్యా "2"

చరణం :బంధువులే భాధించెడబాసినా
నా వారే నన్నే అమ్మేసిన "2"
              స్నేహితులే చూడనట్టు వెళ్లిపోయిన
నన్ను ఒంటరిని చేసి రాళ్లు రువ్విన "2" "నా జీవితమే"

చరణం :బ్రతుకంతా చీకటి కమ్మేసిన
రక్కసి వేదనలే శోధించిన "2"
రోధనలే రోగమై వేధించిన
మరణాలు విలయాలు కబలించిన "2" "నా జీవితమే"

చరణం :బలహీనతలో నను బలపరిచిన
పాపినైన నాకై మరణించిన "2"
మృతమైన నన్ను మహిమగా మార్చిన
మారని నీ ప్రేమకై బానిసైనా "2" "నా జీవితమే"






Monday, 2 January 2023

అతిపరిశుద్ధుడా ....

 


పల్లవి : అతిపరిశుద్ధుడా స్తుతినైవేద్యము
నీకే అర్పించి కీర్తింతును
నీవు నా పక్షమై నను దీవించగా .....
నీవు నా తోడువై నను నడిపించగా
జీవింతును నీకోసమే ఆశ్రయమైన నా యేసయ్యా "అతిపరి"

చరణం :సర్వోన్నతమైన స్థలములయందు నీ మహిమ వివరింపగా
ఉన్నతమైన నీ సంకల్పము ఎన్నడు ఆశ్చర్యమే "2" ముందెన్నడూ చవిచూడని సరిక్రొత్తదైన ప్రేమామృతం "2" నీలోనే దాచావు ఈనాటికై నీ ఋణం తీరదు ఏనాటికి "2" "అతిపరి"

చరణం :సద్గుణరాశి నీ జాడలను నా యెదుట నుంచుకొని గడిచిన కాలం సాగిన పయనం నీ కృపకు సంకేతమే "2" కృపవెంబడి కృపపొందగా మారాను మధురముగా నే పొందగా "2" నాలోన ఏ మంచి చూసావయ్యా నీప్రేమ చూపితివి నా యేసయ్యా "2" "అతిపరి"

చరణం :సారెపైనున్న పాత్రగ నన్ను చేజారిపోనివ్వక
శోధనలెన్నో ఎదిరించినను నను సోలిపోనివ్వక "2" ఉన్నావులె ప్రతిక్షణమునా కలిసి ఉన్నావులె ప్రతిఅడుగున "2" నీవెగా యేసయ్యా నా ఊపిరి నీవెగా యేసయ్యా నా కాపరి "2" "అతిపరి"

నా మనస్సా...(అలంకరించును)

 


పల్లవి : నా మనస్సా ఆయన మరుచునా
దేవుడు నిన్ను మరచిపోవునా "2"
ఆయనే నీ భాధలన్నీ కనుమరుగు చేయునే
ఆనంద తైలము నీపై కుమ్మరించునే "2"
            స్తుతింపజేయునే నిన్ను అలంకరించునే
కోల్పోయినదంతా పునరుద్ధరించునే "2"
                                                                                           

చరణం : నిట్టూర్పు శబ్దము విన్న నీ హద్దులన్నిటిలో
సమృద్ధి గానాలెన్నో ఇది మొదలు వినబడునే "2"
తరగిపోను నేను అణగార్చబడను నేను "2"
               స్తుతింపజేయునే నిన్ను అలంకరించునే
కోల్పోయినదంతా పునరుద్ధరించునే "2"

             సరిచేయు వాడే ఓ...స్థిరపరచినాడే
బలపరచినాడే పూర్ణుణ్ణి చేయునే సరి చేసి నిన్ను హెచ్చించిన ప్రభువు ఈ నూతనవత్సరములో అలంకరించునే.
                                                                                            
చరణం : విచారించే వారు లేక ఒంటరియై యున్న నీకు
ఆరోగ్యము దయచేసి పరిపాలన నిచ్చునే "2"
కూలిన కోటను రాజగృహముగా మార్చును "2"
               స్తుతింపజేయునే నిన్ను అలంకరించునే
కోల్పోయినదంతా పునరుద్ధరించునే "2"
                                                                                              '' నా మనస్సా "




Saturday, 8 October 2022

నా యేసునాధ నీవే...

 


పల్లవి : నా యేసునాధ నీవే - నా ప్రాణదాత నీవే
నీ ప్రేమ చాలు నాకు
నా దాగుచోటు నీవే యేసయ్యా "2"
            నా జీవితాంతము నిన్నే స్తుతింతును 
            నే బ్రతుకుదినములు నిన్నే స్మరింతును 
            ఏ రీతి పాడనూ - నీ ప్రేమ గీతము 
            ఏనాడు వీడనీ  - నీ స్నేహ బంధము                        "నా యేసునాధ" 



చరణం : ప్రభు యేసు దైవమా - చిరకాల స్నేహమా
నీలో నిరిక్షణే - బలమైనదీ
ప్రియమార నీ స్వరం - వినిపించు ఈ క్షణం
నీ జీవవాక్యమే - వెలుగైనదీ
               నీ సన్నిధానమే  - సంతోష గానమై 
               నీ నామ ధ్యానమే - సీయోను మార్గమై 
               భయపడను నేనిక - నీ ప్రేమ సాక్షిగా 
               గానమై - రాగమై 
               అనుదినము నిన్నే - ఆరాధింతును  
               కలకాలం నీలో - ఆనందింతును                           "నా యేసునాధ" 


చరణం : కొనియాడి పాడనా - మనసార వేడనా
నీ ప్రేమ మాటలే - విలువైనవీ
ఎనలేని బాటలో - వెనువెంట తోడుగా
నా యందు నీ కృప - ఘనమైనదీ
               నా నీతి సూర్యుడా - నీ ప్రేమ శాశ్వతం 
               నా జీవ యాత్రలో - నీవేగ ఆశ్రయం  
               నీ పాద సేవయే - నాలోని ఆశగా 
               ప్రాణమా - జీవమా 
               అనుదినము నిన్నే - ఆరాధింతును  
               కలకాలం నీలో - ఆనందింతును                          "నా యేసునాధ" 




Saturday, 1 October 2022

ఉన్నవాడవు...

 


పల్లవి : ఉన్నవాడవు అనువాడవు నీవు
నిన్న నేడు నిరతము మారని మా యేసయ్య  "2"
అ. ప : అల్ఫాయు ఓమేఘయు నీవే కదా
అధ్యంతరహితుడవు నీవే కదా   "2"
హల్లేలూయా స్తోత్రార్హుడా
            యుగయుగములకు స్తుతిపాత్రుడా "2"  
                                                                                      "ఉన్నవాడవు "


చరణం : పలుకబడిన వాక్కుతో ప్రపంచములు నిర్మించితివి
మంటితో మమ్ము చేసి జీవాత్మను ఊదితివి "2"
               మమ్మునెంతో ప్రేమించి మహిమతో నింపితివి
పరము నుండి దిగివచ్చి మాతో నడిచితివి            "అల్ఫాయు"

 
చరణం : పాపమంటియున్న మాకై మా పరమ వైద్యునిగా
నీ రుధిరం మాకై కార్చి ప్రాయశ్చిత్తం చేయగా "2"
      మొదటివాడా కడపటివాడా జీవింపజేసితివే
నీదు ఆత్మతో నింపితివి మము సరిచేసితివి "అల్ఫాయు"


చరణం : ప్రతివాని మోకాలు వంగును నీ నామమున
ప్రతివాని నాలుక చాటును నీ మహిమను "2"
                తరతరములకు మమ్మేలువాడ భూపతుల రాజువే
మేఘారుడుడై దిగివచ్చి మహినేలు మహారాజువే "అల్ఫాయు"





Friday, 30 September 2022

నీ మేలులు వివరింపతరమా...

  


పల్లవి : నీ మేలులు వివరింపతరమా ప్రభువా  
నీ కృపలను నే మరువగలనా                  "2"
            
అ. ప : ఆదరించావు అగాపే ప్రేమతో
ఆదుకున్నావు నీ జాలి మనసుతో - నీ జాలి మనసుతో   
                                "నీ మేలులు "

చరణం :శోధనలే నన్ను వెన్నంటివున్నా
బహు శ్రమలతో నేను సతమతమవుతున్నా "2"
               నను ధైర్యపరచి నడిపించినావే
నా హృదయవేదన తొలగించినావే   "ఆదరించావు"

చరణం :ఊహించలేని కార్యాలు ఎన్నో
లేకించలేని పర్యాయములలో "2"
               నా జీవితంలో జరిగించినావే
నీ కృపతో నిత్యము దీవించినావే   "ఆదరించావు"

చరణం :మరచిపోలేని నీ మేలులెన్నో
దయచేసినావే నా జీవితంలో "2"
               నీ ప్రేమకు సాటి లేదేది ఇలలో
నీ కరుణకు బదులు ఏముంది ధరలో   "ఆదరించావు"